బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని మొత్తం పూర్తీ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. వర్కింగ్ డే లో కూడా సినిమా పాజిటివ్ టాక్ పవర్ ని చూపిస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
ఇక సినిమా 5వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా ఈ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బుకింగ్స్ చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ 4వ రోజుతో పోల్చితే 30% రేంజ్ కి అటూ ఇటూగా…
డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఇదే విధంగా డ్రాప్స్ ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా వర్కింగ్ డే లో ఇది మంచి హోల్డ్ అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద…
ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె 2.2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.