6 ఏళ్ల క్రితం హీరోగా కెరీర్ ని మొదలు పెట్టిన అఖిల్ అక్కినేని తొలి సినిమా కే ఓపెనింగ్స్ పరంగా అప్పట్లో స్టార్స్ రేంజ్ ఓపెనింగ్స్ తో భీభత్సం సృష్టించాడు. అఖిల్ ది పవర్ ఆఫ్ జువా ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోవడం తో అద్బుతమైన స్టార్ట్ ను కంటిన్యూ చేయలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అవ్వగా తర్వాత రెండో సినిమా హలో తో మళ్ళీ…
రీలాంచ్ అంటూ మరో ప్రయత్నం చేయగా ఈ సారి టాక్ డీసెంట్ గానే ఉన్నా పోటి లో MCA లాంటి కమర్షియల్ మూవీ అండ్ బిజినెస్ ఎక్కువగా జరగడంతో అంచనాలను అందుకోలేక మరో ఫ్లాఫ్ ను మూట గట్టుకుని మూడో సినిమా మిస్టర్ మజ్ను రీ రీ లాంచ్ అయిన అఖిల్…
ఈ సినిమా తో కూడా డీసెంట్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రప్పించ లేక మరో ఫ్లాఫ్ ని కొట్టి హాట్రిక్ ఫ్లాఫ్స్ తో కెరీర్ లో క్లీన్ హిట్ కొట్టాల్సిన అవసరం తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో…
ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా బిజినెస్ ఈ సారి కొంచం తగ్గడం తో 19 కోట్ల టార్గెట్ కి మూడు రోజుల వీకెండ్ లోనే 17.2 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపిన అఖిల్ ఇప్పుడు 4 వ రోజు సాధించే కలెక్షన్స్ తో బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేయడం ఖాయంగా మారగా ఫైనల్ గా ఈ రోజు లెక్కలు అనుకూలంగా ఉంటే…
కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ ని సొంతం చేసుకుని 6 ఏళ్ల నిరీక్షణకి తెర వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిసారి క్లీన్ హిట్ ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నాడు అఖిల్… క్లాస్ సినిమా పోటి లో మరీ అనుకున్న రేంజ్ టాక్ రాకున్నా కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో తర్వాత సినిమా ఏజెంట్ పక్కా మాస్ మూవీ కావడంతో తన కెరీర్ ని మరింత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.