రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ రెండు మూడు రోజుల్లో టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా రికార్డుల భీభత్సం సృష్టించిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, ఎక్స్ లెంట్ గా జోరు చూపించి వీకెండ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో 39.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 54 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా… 4వ రోజున వర్కింగ్ డే లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 4వ రోజున 5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక అమెరికాలో స్లో అయిన సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపిస్తూ జోరు ని చూపిస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆవల ఓవరాల్ గా 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గ్రాస్ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది. దాంతో టోటల్ గా 4వ రోజున 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…. ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవరాల్ గా…
60 కోట్ల మార్క్ ని దాటేసి 61 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, నాగ చైతన్య కెరీర్ లో ఫాస్టెస్ట్ అనిపిస్తూ కేవలం 4 రోజుల్లో 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని తండేల్ మాస్ రచ్చ చేసింది. ఇక టోటల్ గా 4 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.