మాస్ మహారాజ్ రవితేజ తెలుగు లో ప్రజెంట్ చేసిన లేటెస్ట్ మూవీ మట్టి కుస్తీ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా సినిమా ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయింది. మొదటి రోజు నుండే బిలో పార్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా…..
తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇక వర్కింగ్ డేస్ 3 రోజుల్లో మొత్తం మీద సినిమా పట్టుమని 40 లక్షల రేంజ్ లో కూడా…
గ్రాస్ ను అందుకోలేక పోయింది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.40 కోట్ల రేంజ్ లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా షేర్ మొత్తం మీద 72 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా…
సినిమా టోటల్ బిజినెస్ వాల్యూ 2 కోట్ల రేంజ్ లో ఉండగా 2.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక అది అసాధ్యమే కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ తోనే సినిమా రన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది.