బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అయినా ఓపెనింగ్ డే నుండే పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది…ఉన్నంతలో ఓకే అనిపించే రేంజ్ లో వసూళ్ళని…
సొంతం చేసుకుంటున్నా కూడా అవి సినిమా టార్గెట్ ను అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి…5వ రోజు సంక్రాంతికి పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా ఇప్పుడు కనుమ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా జోరుని ఏమి చూపించ లేక పోతుంది…
ట్రాక్ చేసిన సెంటర్స్ లో 5వ రోజుతో పోల్చితే డ్రాప్స్ గట్టిగానే ఉన్న నేపధ్యంలో మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2.4-2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది…
ఇక సినిమా కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోతుంది. హిందీ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 4 కోట్ల దాకా…
వెళ్ళే అవకాశం ఉంది కానీ ఆఫ్ లైన్ లెక్కలు సూపర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది…మొత్తం మీద ఫెస్టివల్ టైంలోనే సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే సినిమా కొన్నవాళ్ళకి చుక్కలు కనిపించేలా చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 6 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…