టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర పోటి లో కూడా తన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, ఇక సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 93 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటున్న సినిమా మొత్తం మీద..
7 వ రోజు ఇప్పుడు మినిమమ్ 7 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం, ఫైనల్ లెక్కలను బట్టి ఇంకా ఎక్కువే కలెక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 100 కోట్ల షేర్ మార్క్ ని మొదటి వారం లోనే అందుకుందని చెప్పొచ్చు.
టాలీవుడ్ చరిత్రలో ఇలా బాక్ టు బాక్ మూడు సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న హీరోగా మహేష్ సంచలన రికార్డ్ కొట్టాడు, మహేష్ కన్నా ముందు ప్రభాస్ బాహుబలి సిరీస్ సాహో లతో ఈ రికార్డ్ అందుకోగా అవన్నీ పాన్ ఇండియా మూవీస్ కానీ మహేష్ డైరెక్ట్ తెలుగు మూవీస్ తోనే…
సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు, భరత్ అనే నేను కలెక్షన్స్ పై ట్రేడ్ లో ఫ్యాన్స్ లో ఇప్పటికీ క్లారిటీ లేదు… సో అది నమ్మం అన్న వాళ్లకి కూడా షాక్ ఇస్తూ బాక్ టు బాక్ 2 వంద కోట్ల సినిమాలతో కూడా మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు అని చెప్పాలి.
సంక్రాంతి సీజన్ లో భారీ పోటి లో కేవలం వారం లో 100 కోట్లు వెనక్కి రాబట్టడం అంటే మామూలు విషయం కాదు, కానీ సూపర్ స్టార్ మహేష్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ వారం లో 100 కోట్లతో పాటు బ్రేక్ ఈవెన్ ని కూడా సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసి వారంలో 100 కోట్లు రికవరీ ని డైరెక్ట్ తెలుగు మూవీ తోనే అందుకుని చరిత్రకెక్కాడు.