బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తీ చేసుకున్న కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా రెండో వారం మొదటి రోజు అయిన 8 వ రోజు మరో వర్కింగ్ డే అయినా కానీ సినిమా చాలా బాగా హోల్డ్ ని కొనసాగిస్తూ పరుగును కొనసాగిస్తుంది… సినిమా తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు తో పోల్చితే 8వ రోజు ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద 1.6-1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక సినిమా…
హిందీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా తమిళనాడు మరియు కేరళలో మొత్తం మీద 5-6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చెసుకున అవకాశం ఉంది. దాంతో మొత్తం మీద ఇండియా లో ఈ రోజు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సాధించే కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 33 కోట్ల నుండి 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. దాంతో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు సాధించిన కలెక్షన్స్ టోటల్ వరల్డ్ వైడ్ గా…
750 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు చూపించడం ఖాయమని చెప్పొచ్చు. మరి రెండో వీకెండ్ మొత్తం మీద ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక 8 రోజులకు గాను సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.