Home న్యూస్ అక్కడ ఫ్లాఫ్…కానీ ఇక్కడ 75M తో గీతాంజలి మాస్ రచ్చ!

అక్కడ ఫ్లాఫ్…కానీ ఇక్కడ 75M తో గీతాంజలి మాస్ రచ్చ!

0

చాలా వరకు ఆడియన్స్ సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే తప్పితే థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడటం లేదు, కొంచం టాక్ మిక్సుడ్ గా వచ్చిన కూడా రెండు మూడు వారాలకే డిజిటల్ లో రిలీజ్ అవుతుంది అన్న నమ్మకంతో ఆ సినిమాలను థియేటర్స్ లో కాకుండా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు చూడటానికి సిద్ధం అవుతున్నారు.

దాంతో మిక్సుడ్ టాక్ వచ్చిన మూవీస్ త్వరగానే పరుగును కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు అంజలి(Anjali) కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi) సినిమా….

మొదటి పార్ట్ సక్సెస్ అడ్వాంటేజ్ ను వాడుకోవడానికి అరిగిపోయిన హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుని ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయింది… దాంతో టోటల్ రన్ లో 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకోగా….

సినిమా రీసెంట్ గా ఆహా వీడియోలో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, అక్కడ సినిమాకి సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా ఆల్ మోస్ట్ 75 మిలియన్ యూనిక్ 1 మినట్ వాట్చ్ టైం తో సినిమా దూసుకు పోతూ ఉండటం విశేషం, మిగిలిన OTTలతో పోల్చితే యూసర్స్ కొంచం తక్కువగా ఉండే ఆహా వీడియోలో ఇలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా డిజిటల్ లో మాత్రం సినిమా కి ఓవరాల్ గా మంచి వ్యూవర్ షిప్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా త్వరలో టెలివిజన్ లో టెలికాస్ట్ కానుందని అంటున్నారు. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here