Home న్యూస్ అక్షరాలా 765 కోట్లు…..ఊహకందని ఊచకోత ఇది!!

అక్షరాలా 765 కోట్లు…..ఊహకందని ఊచకోత ఇది!!

0

మణిరత్నం డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్1 సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన పొన్నియన్ సెల్వన్2 సినిమా మరీ పార్ట్ 1 రేంజ్ లో రెచ్చిపోక పోయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రన్ ని కొనసాగిస్తూ 300 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….

సినిమా 9వ రోజు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 270 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించగా ఓవరాల్ గా మొదటి పార్ట్ కలెక్షన్స్ ని కూడా కలిపితే ఇప్పుడు మొత్తం మీద సినిమా రెండు పార్టుల కలెక్షన్స్ లెక్క…

Ponniyin Selvan2 8 Days Total Collections!!

ఏకంగా 760 కోట్ల మార్క్ ని అధిగమించడం విశేషం. పార్ట్ 1 మూవీ టోటల్ రన్ లో 495 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు పార్ట్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 270 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుంది.

దాంతో సినిమా రెండు పార్టుల కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 765 కోట్ల మార్క్ గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 120 వర్కింగ్ డేస్ లో 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఊహకందని లాభాలను మేకర్స్ కి సొంతం అయ్యేలా చేసింది. పార్ట్ 2 మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

Ponniyin Selvan2 1st Week (7 Days) Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here