బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన 4 సినిమాలు కూడా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా 4 సినిమాల్లో సర్దార్ ఆల్ రెడీ హిట్ అవ్వగా ఓరి దేవుడా సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది.. ఇక 7వ రోజు అన్ని సినిమాల రిపోర్ట్ లను గమనిస్తే జిన్నా సినిమా మరింత స్లో అవ్వగా ఈ రోజు షేర్ 3 లక్షల రేంజ్ లో ఉండొచ్చు.
ఇక ప్రిన్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి స్లో డౌన్ అవ్వగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఓరి దేవుడా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మొత్తం మీద 20 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సర్దార్ సినిమా ఈ రోజు కొంచం డ్రాప్ అయినా అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కొంచం ఎక్కువ కలెక్షన్స్ రావొచ్చు.
ఇక కాంతార సినిమా 13వ రోజులో ఎంటర్ అయినా మిగిలిన సినిమాలను డామినేట్ చేస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 45 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు.