మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 6వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఇప్పుడు 7వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా మరోసారి సాలిడ్ గానే హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమా 6వ రోజు తో పోల్చితే ఇప్పుడు సినిమా 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 25-30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా, దాంతో తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని చూపించిన సినిమా మొత్తం మీద ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
అటూ ఇటూగా 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే సినిమా 1.4 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
సినిమా 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక మొదటి వారం ఏరియాల వారి కలక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.