సరిగ్గా ఏడేళ్ళ క్రితం శేఖర్ కమ్ముల(Shekar Kammula) వరుణ్ తేజ్(Varun Tej) మరియు సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబినేషన్ లో వచ్చిన ఫిదా(Fidaa Movie) సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది… వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంచే ఒక్కటే పర్వాలేదు అనిపించినా బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఫిదా కథని శేఖర్ కమ్ముల చెప్పగా కథని చేసిన వరుణ్ తేజ్…
ఈ సినిమా తోనే కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకుని తర్వాత కొంత కాలం మంచి ఫామ్ ని కొనసాగించాడు. ప్రేమం తో సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సాయి పల్లవి ని తెలుగు లో పరిచయం చేయాలనీ ఫిక్స్ అయిన శేఖర్ కమ్ముల సినిమా కథ సిద్ధం అయిన వెంటనే…
సాయి పల్లవి కి చెప్పగా ఈ సినిమా తో ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ముందు నిలిచే హీరోయిన్ గా మారింది. ఇక హ్యాపీడేస్ తర్వాత చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు…
అంచనాలను అందుకోని టైం లో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న టైం లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలు లేకున్నా శేఖర్ కమ్ముల మీద నమ్మకంతో 18 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ టాక్ ని సొంతం చేసుకుని….
టోటల్ రన్ లో ఏకంగా 48.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి బిజినెస్ మీద 30.5 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో అత్యధిక లాభాలతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం అని చెప్పొచ్చు.