కెరీర్ లో హిట్స్ ఫ్లాఫ్స్ అన్నది ప్రతీ ఒక్కరికీ ఉంటాయి, కానీ కెరీర్ లో భారీ డిసాస్టర్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కంబ్యాక్ అంతే స్ట్రాంగ్ గా కొట్టే హీరోలు కొందరే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఫీట్ నే సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా నాగ చైతన్య కి రెండు డిసాస్టర్ మూవీస్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ మూవీగా నిలవగా ఇప్పుడు కెరీర్ లో కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తూ మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండటం విశేషం..
రీసెంట్ గా 75 కోట్ల సెన్సేషనల్ గ్రాస్ మార్క్ ని సినిమా అందుకోగా ఇప్పుడు రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 80 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా 10 రోజుల్లో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వరల్డ్ వైడ్ గా…
83-84 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది. సినిమా 10వ రోజున వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా… ఈ రోజు కలెక్షన్స్ తో నాగ చైతన్య కెరీర్ లో మొదటి 80 కోట్ల గ్రాస్ ను..
అందుకున్న సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా నాగ చైతన్య లాస్ట్ సోలో మూవీ కస్టడీ టోటల్ రన్ లో 16 కోట్ల లోపే గ్రాస్ ను అందుకుని భారీ డిసాస్టర్ అవ్వగా ఇప్పుడు 16 కోట్ల నుండి 10 రోజుల్లోనే 84 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మాస్ భీభత్సం సృష్టించాడు నాగ చైతన్య…
ఇక సినిమా ఈ వారం తో పాటు వచ్చే వారంలో మరో 2 డబ్బింగ్ సినిమాలు మాత్రమే పోటిలో ఉండటంతో ఇదే జోరుని కొనసాగిస్తే 100 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.