బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఆల్ రెడీ మంచి లాభాలను సొంతం చేసుకుంటూ…
దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో మంచి లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా ఇప్పుడు ఆల్ రెడీ నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం..
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 11 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసింది…అలాగే వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రేడ్ లెక్కల్లో 85 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది..
మేకర్స్ లెక్కల్లో ఆల్ రెడీ 100 కోట్లు దాటింది అని పబ్లిసిటీ పోస్టర్ లాంటిది రిలీజ్ చేయగా ట్రేడ్ లెక్కలకు మేకర్స్ లెక్కలు తేడా ఉండటం కామన్ కాబట్టి ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి….
లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు అయితే పరుగులు పెడుతుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇదే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగిస్తే వచ్చే వీకెండ్ తో పాటు శివరాత్రి వీకెండ్ అడ్వాంటేజ్ లతో కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్ ను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.