Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 8 కలెక్షన్స్…60 కోట్లు ఔట్!!

ఇస్మార్ట్ శంకర్ డే 8 కలెక్షన్స్…60 కోట్లు ఔట్!!

1

  బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో మొదటి వారాన్ని అల్టిమేట్ లెవల్ లో ముగించిన రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టింది, మొదటి వారంలో 29.67 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా 8 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో తొలి రెండు షోలకు 15% లోపు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చేసరికి ఫైనల్ గా 18% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది.

మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండగా క్లాస్ సెంటర్స్ లో మాత్రం స్లో డౌన్ అయ్యింది, అయినా కానీ మొత్తం మీద సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండేలా కనిపిస్తున్నాయి కాబట్టి 1 కోటి కి అటూ ఇటూ గా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా నిర్మాతల లెక్కల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకోబోతుంది, ఇది రామ్ కెరీర్ లోనే మొట్ట మొదటి 60 కోట్ల గ్రాస్ మూవీ అని చెప్పొచ్చు. ఇక 9 వ రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర డియర్ కామ్రేడ్ నుండి పోటి ని ఎంతవరకు తట్టుకుంటుంది అన్న దాని పై ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది అంచనా వేయవచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here