మొత్తం మీద దసరా పండగ టైం లో రేసులో ఉన్న సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు పెళ్లి సందD సినిమాలు మొదటి వారాన్ని షేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేశాయి. ఇక మొదటి వారం పూర్తీ అయిన తర్వాత రెండు సినిమాలు రెండో వారంలో అడుగు పెట్టగా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి కానీ…
సర్ప్రైజింగ్ గా పెళ్లి సందD సినిమా ఆల్ మోస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి ఈక్వల్ అనిపించేలా ఈ రోజు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 7 వ రోజు 36 లక్షల షేర్ ని అందుకోగా 8 వ రోజున ఆల్ మోస్ట్ 30% డ్రాప్ అయ్యి…
20-23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తుండగా మరో పక్క పెళ్లి సందD 7 వ రోజు 24 లక్షల షేర్ ని అందుకోగా 8 వ రోజు 10-15% డ్రాప్ అయ్యి 20 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా పెర్ఫార్మ్ చేస్తుంది. మరి 2 సినిమాలు అఫీషియల్ గా 8 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి ఇక.