బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రెండో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాల లోకి ఎంటర్ అయిన సినిమా అన్ని చోట్లా మంచి జోరునే చూపెడుతుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు మరోసారి వర్కింగ్ డే నే అవ్వడంతో మరోసారి డ్రాప్స్ అన్ని చోట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా 7వ రోజుతో కంపేర్ చేస్తే 20% రేంజ్ లో డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఉండగా…..
సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే 2.2 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక హిందీలో సినిమా కొంచం ఎక్కువ డ్రాప్ అవ్వగా….
అక్కడ సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా కర్ణాటక తమిళ్ మరియు కేరళ ఓవర్సీస్ లు కలిపి 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 8వ రోజు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా….
3.5-3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది….ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంచం పెరగవచ్చు. వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉండగా తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి సినిమా పుంజుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 8 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.