Home Uncategorized 950 కోట్లు ఔట్….చరిత్ర సృష్టిస్తున్న పఠాన్!!

950 కోట్లు ఔట్….చరిత్ర సృష్టిస్తున్న పఠాన్!!

0

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన రోజు నుండే ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులను పూర్తీ చేసుకుని ఎపిక్ రికార్డుల జోరుని…

కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 19 రోజులు పూర్తీ అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో టోటల్ గా 489 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇండియన్ గ్రాస్ 588 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది.

ఇక సినిమా టోటల్ ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క 358 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను సృష్టించగా టోటల్ గా 19 డేస్ గ్రాస్ లెక్క వరల్డ్ వైడ్ గా 946 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

20వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇండియాలో 493 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 950 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 1000 కోట్ల ఎపిక్ బెంచ్ మార్క్ దిశగా వెళుతుంది. ఈ వీకెండ్ లో కొత్త సినిమాలు ఉన్నా పఠాన్ హావా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here