పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ క్రేజ్ నడుమ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించింది అని చెప్పాలి. వీకెండ్ వరకు కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన ఈ సినిమా తర్వాత స్లో అయినా వీకెండ్స్ లో మంచి వసూళ్ళని సాధిస్తూ వర్కింగ్ డేస్ లో స్లో అవుతూ వచ్చింది….
మొత్తం మీద ఇప్పుడు పరుగు ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో మాత్రం సినిమా పరుగు కంప్లీట్ అయింది. అక్కడ లోకల్ మూవీస్ వలన సినిమా పరుగు రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద 2 చోట్లా సినిమా బిజినెస్….
9 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకోగా టోటల్ రన్ లో సినిమా కర్ణాటకలో 7.30 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల మొత్తం మీద 93 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 8.23 కోట్లు సాధించిన సినిమా బిజినెస్ నుండి 77 లక్షల దాకా లాస్ ను సొంతం చేసుకుంది… పోటిలో ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసినా లాభాలు మాత్రం దక్కలేదు..