బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, వర్కింగ్ డేస్ లో…
సినిమా పూర్ కలెక్షన్స్ తో స్లో అవ్వగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 9వ రోజు వీకెండ్ లో శనివారం అడ్వాంటేజ్ తో ఎట్టకేలకు కొంచం గ్రోత్ ని అయితే చూపించింది అని చెప్పాలి. ప్రతీ రోజూ 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్న సినిమా…
9వ రోజు మాత్రం చాలా సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 8వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా హైదరాబాదులో నైట్ షోల బుకింగ్స్ కొద్ది వరకు బాగుండటంతో 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 75 నుండి 85 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉండగా హిందీలో మాత్రం స్క్రీన్స్ ని బాగా కోల్పోయిన ఉన్నంతలో 2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…
దాంతో సినిమా టోటల్ గా 9వ రోజు వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2 కోట్లకి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు, ఇది కొద్ది వరకు గ్రోత్ అనే చెప్పాలి కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇవి సరిపోవు. ఇక టోటల్ గా 9 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.