Home న్యూస్ 800 మూవీ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

800 మూవీ టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చాలానే సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో బయోపిక్ గా వచ్చిన సినిమా 800 మూవీ…  శ్రీలంక క్రికెటర్ అయిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకేక్కుతున్న కొత్త సినిమా 800 మూవీ… వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

శ్రీలంకలో పుట్టిన తమిళవాడు అయిన మురళీధరన్ తన లైఫ్ లో క్రికెటర్ అవ్వక ముందు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, క్రికెటర్ అయిన తర్వాత వివాదస్పదమైన తన బౌలింగ్ యాక్షన్ ఇబ్బందులను ఎలా ఎదురు ఒడ్డి ఒక లెజెండ్రీ బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు అన్నది సినిమాలో చూపెట్టారు..

బౌలర్ గా తను ఫేస్ చేసిన ఇబ్బందులను చాలా వరకు సోషల్ మీడియా వలన అందరికీ తెలిసిందే అయినా తాను ఫేస్ చేసిన ఇబ్బందులు శ్రీలంకలో తను ఎదురుకొన్న ఇబ్బందులను ఎలా మురళీధరన్ అధిగమించి ఈ స్టేజ్ కి వచ్చాడు అన్నది చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది సినిమాలో…

కానీ ఓవరాల్ గా సినిమా పరంగా చెప్పాలి అంటే లెంత్ కొంచం ఎక్కువ అయ్యి డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది సినిమా, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా సాగదీసినట్లు అనిపించడం మేజర్ డ్రా బ్యాక్… అలాగే కొన్ని ఇతర క్రికెటర్ బయోపిక్స్ తో పోల్చితే….

800 మూవీ కొంచం తగ్గినట్లు అనిపిస్తుంది… అయినా కానీ మురళీధరన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, బయోపిక్స్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యి డిఫెరెంట్ మూవీస్ చూడాలి అనుకునే వాళ్ళు కొంచం ఓపిక పట్టి చూస్తె 800 మూవీ బాగుంది అనిపించేలా మెప్పిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here