Home న్యూస్ రత్నం మూవీ OTT రెస్పాన్స్….ఇది ఊహించలేదుగా ఎవ్వరూ!

రత్నం మూవీ OTT రెస్పాన్స్….ఇది ఊహించలేదుగా ఎవ్వరూ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా కోలివుడ్ హీరో విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాను జనాలు అసలు థియేటర్స్ లో ఏమాత్రం చూడలేదు.. లాస్ట్ ఇయర్ మార్క్ ఆంటోని లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విశాల్ నుండి వచ్చిన ఈ సినిమా విశాల్ కి…

మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అలాంటిది ఏమి జరగలేదు….దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 21 కోట్ల లోపే గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా….దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత సినిమా…

రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకి కొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రీసెంట్ గా సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయగా ఇప్పుడు OTT లో సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ కూడా అందరూ మిక్సుడ్ టాక్ నే ఎక్స్ పెర్ట్ చేశారు కానీ…

డిజిటల్ లో సినిమా ను చూసిన ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. సినిమాలో మదర్ సెంటి మెంట్ సీన్స్ బాగా వచ్చాయని, ఇక విశాల్ యాక్షన్ సీన్స్ మరీ కొంచం ఓవర్ డోస్ లా అనిపించినా కూడా చాలా వరకు మెప్పించాయని, కానీ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండటం కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించడం…

అలాగే కథ చాలా వరకు ప్రిడిక్ట్ చేసేలా ఉండటం మైనస్ పాయింట్స్ అయినా కూడా డిజిటల్ లో ఈజీగా ఒకసారి చూసేలా సినిమా ఉంది అన్న టాక్ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వినిపిస్తూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ దృశ్యా మరీ నెగటివ్ టాక్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేసినా ఇక్కడ మాత్రం సినిమా కి కొంచం టాక్ బెటర్ గానే ఉండటంతో వ్యూవర్ షిప్ బాగానే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here