బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా సినిమా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన మిస్టర్ బచ్చన్(Mr Bachan Movie Business) ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా ఇంత సడెన్ రిలీజ్ అవ్వాల్సింది కాదు కానీ…
ఓటిటి అగ్రిమెంట్ ల వలన సినిమా ఆ టైంకి రిలీజ్ కి సిద్ధం అవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ అదే రోజున ఇతర సినిమాలతో పాటు మాస్ మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) కూడా రిలీజ్ కానుండగా పోటి తీవ్రంగానే ఉండబోతున్నప్పటికీ…
లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ అయినందునా రెండు సినిమాలు ఈజీగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది..ఇక సినిమా రిలీజ్ కన్ఫాం అవ్వడంతో బిజినెస్ పరంగా మేకర్స్ తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఆఫర్స్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నారట. మంచి హాలిడే రిలీజ్ అవ్వడం…
పోటి ఉన్నప్పటికీ రవితేజ-హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వడంతో రవితేజ ప్రీవియస్ మూవీస్ భారీ ఫ్లాఫ్స్ గా నిలిచినా కూడా మిస్టర్ బచ్చన్ మూవీకి ఏకంగా 30 కోట్లకు పైగానే బిజినెస్ ను కోట్ చేశారట. ఆ రేంజ్ లో బిజినెస్ చేయడం అంటే బయర్స్ కి కొంచం కష్టమే…
కానీ సినిమా ఔట్ పుట్ మీద నమ్మకంగా ఉన్న మేకర్స్ మినిమమ్ ఆ రేటు నుండే ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నారట. కానీ అంత పోటిలో ఇలాంటి బిజినెస్ రికవరీ అవ్వాలి అంటే సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ చాలా అవసరమా అనే చెప్పాలి….
అలాంటి రెస్పాన్స్ రావాలి అదే టైంలో ఇతర సినిమాల రిజల్ట్ ల పై కూడా బిజినెస్ రికవరీ ఆధారపడి ఉంటుంది. అసలే ఫ్లాఫ్స్ లో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ను సడెన్ గా పోటిలో దింపబోతుండగా ఎంతవరకు అంచనాలను అందుకుని కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తాడో చూడాలి.