Home న్యూస్ హైప్ లేదు…సాంగ్స్ ఫ్లాఫ్…కానీ ఓవర్సీస్ లో విజయ్ రికార్డుల జాతర!

హైప్ లేదు…సాంగ్స్ ఫ్లాఫ్…కానీ ఓవర్సీస్ లో విజయ్ రికార్డుల జాతర!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కి ఏ రేంజ్ మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే, విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా పాజిటివ్ టాక్ ను ఏమి సొంతం చేసుకోలేదు కానీ అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసి భీభత్సం సృష్టించింది. తన లాస్ట్ మూవీ లియో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో టోటల్ గా…

600 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు విజయ్ నటిస్తున్న కొత్త సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ ఈ గురువారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ రేంజ్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో హైప్ అయితే లేదు….

దానికి తోడూ సినిమా సాంగ్స్ అన్నీ కూడా అనుకున్న ఏమాత్రం ఇంపాక్ట్ చూపకుండా నిరాశ పరిచాయి…ఇక ట్రైలర్ ఓకే అనిపించగా ఓవరాల్ గా రీసెంట్ విజయ్ మూవీస్ తో పోల్చితే పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బుకింగ్స్ పరంగా మాత్రం విజయ్ మాస్ క్రేజ్ ను రుజువు చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.

విజయ్ సినిమాలకు ఓవర్సీస్ లో రిమార్కబుల్ మార్కెట్ ఉంది…దాంతో ఇప్పుడు పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కూడా గోట్ మూవీ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 2 మిలియన్ డాలర్స్ కి పైగా జరిగి మాస్ రచ్చ చేసింది…టోటల్ గా అమెరికాలో 7 లక్షలకు పైగా డాలర్స్ ను యుకే యూరప్ లో 7 లక్షలకు పైగా డాలర్స్ ను రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 8 లక్షల డాలర్స్ దాకా…

గ్రాస్ ను సొంతం చేసుకుని టోటల్ గా 2.25 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేయగా ఇండియన్ కరెన్సీలో 18.5 కోట్ల మార్క్ ని దాటేసింది…బజ్ లేని మూవీకే ఈ రేంజ్ లో బుకింగ్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుండగా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా ఓపెనింగ్స్ అన్ని చోట్లా రికార్డులు నమోదు చేయడం ఖాయామని చెప్పొచ్చు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here