Home న్యూస్ 22 డేస్ 304 కోట్ల జాతర….81 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ మాస్!

22 డేస్ 304 కోట్ల జాతర….81 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ మాస్!

0

రిలీజ్ అయిన రోజు నుండి వారం వరం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా మూడు వారాలను పూర్తి చేసుకుని ఇప్పుడు…

నాలుగో వారంలో అడుగు పెట్టగా మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా 22వ రోజు మరోసారి అన్ని చోట్లా కుమ్మేసే కలెక్షన్స్ తోనే రన్ ను కొనసాగిస్తున్న సినిమా ఇప్పుడు 22 రోజుల్లో ఏకంగా 304 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి మంచి జోరుని చూపిస్తూ 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 81 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సాధించింది..

Amaran Movie 19 Days Total WW Collections!!

సినిమా మొత్తం మీద 22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Amaran Movie 22 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 10.90Cr~
👉Ceeded: 2.87Cr~
👉Andhra: 9.78Cr~
AP-TG Total:- 23.55CR(41.75Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 20.05 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో ఎపిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది…

ఇక సినిమా 22 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Amaran Movie 22 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 147.05Cr
👉Telugu States – 41.75Cr
👉Karnataka – 21.70Cr
👉Kerala – 12.00Cr
👉ROI – 4.35Cr
👉Overseas – 77.25Cr***approx
Total WW collection – 304.10CR(148.90CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 81.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Amaran Movie 22 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here