బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా అంచనాలను అందుకోక పోతే ఆ సినిమా ఎందుకని ఫ్లాఫ్ అయిందో తెలుసుకుని తర్వాత సినిమాలకు అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు చాలా వరకు నిర్మాతలు, కానీ కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా నిర్మాతలు మాత్రం వింతగా రియాక్ట్ అవుతున్నారు….
ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ కోలివుడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజ స్టేట్ మెంట్ ఇస్తే…సినిమా డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఏమాత్రం తేరుకోలేక పోయింది…
ఇక సినిమా కో ప్రొడ్యూసర్ సినిమా ఫ్లాఫ్ కి తమిళ్ లో 2 ఫ్యాన్ డమ్స్ కారణం అని, పొలిటికల్ పార్టీలు కూడా కారణం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు, ఈ స్టేట్ మెంట్ తర్వాత సోషల్ మీడియాలో మరింతగా ట్రోల్స్ ను సినిమా సొంతం చేసుకోగా…ఇక కో ప్రొడ్యూసర్…
ధనంజేయన్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మరోసారి వచ్చి ఈ సారి తప్పు మొత్తం ఆడియన్స్ దే అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ టైంలో మీడియాఆడియన్స్ రియాక్షన్ ని వీడియో చేస్తున్న టైంలో ఒక అభిమాని సినిమా అట్టర్ ఫ్లాఫ్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు…
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ సినిమా బాలేదని చూడకుండానే ఫిక్స్ అయ్యారని, అందుకే సినిమా రిజల్ట్ ఇలా వచ్చింది అంటూ చెప్పుకురాగా….మీడియా కూడా ఆ ఇంటర్వ్యూలను హైలెట్ చేసి చూపించడం వలనే…
కంగువకి ఊహించని రేంజ్ లో మిక్సుడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది అంటూ మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు….తప్పంతా ఆడియన్స్ ది అనడంలో మేకర్స్ కి అసలు ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంది అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది అన్నది మరోసారి కన్ఫాం అయ్యింది….
సినిమా నిరాశ పరిచింది…ఆ నిజాన్ని నిర్మాతలు ఇప్పటికీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరనే తెలుస్తుంది….దాంతో సోషల్ మీడియాలో సినిమా మీద నిర్మాతల మీద మరింతగా ట్రోల్స్ పడుతూ ఉన్నాయి ఇప్పుడు…