ఎప్పుడో మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొత్తం అయిపోయి డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సినా కానీ మూడేళ్ళు ఆగి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth)నటించిన లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo Collections) సినిమా…
మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. పరుగును చాలా త్వరగానే పూర్తి చేసుకున్న ఈ సినిమా కోటి రేంజ్ లోనే అతి కష్టం మీద గ్రాస్ ను అందుకుని ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…
రీసెంట్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయింది. ప్రైమ్ వీడియోలో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా, ముందు నుండే డిజిటల్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ముందు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో ఇక్కడ నుండి రెస్పాన్స్…
ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ సినిమా కి రెస్పాన్స్ థియేటర్స్ లో కన్నా కూడా వరస్ట్ గానే ఉందని చెప్పాలి. అసలు స్వామిరారా లాంటి కాంబోలో రూపొందిన సినిమా కథ ఇంత పేలవంగా ఉండటం ఏంటి అంటూ చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…
అసలు మంచి కథలను సెలెక్ట్ చేసుకునే నిఖిల్ ఇలాంటి కథని ఎందుకని ఒప్పుకున్నాడో నిఖిల్ కే తెలియాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు….పేపర్ తిన్ స్టోరీ లైన్ తో 2 గంటలు ప్యూర్ టార్చర్ అనిపించేలా సినిమా తీశారని, కోటి రేంజ్ లోపే కలెక్షన్స్ ని సినిమా…
అందుకోవడంలో అసలు ఎలాంటి తప్పు లేదంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి సినిమా మీద….ఇన్ని ట్రోల్స్ పడ్డా కూడా సినిమా ప్రైమ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం. థియేటర్ ఆడియన్స్ కి నచ్చకపోయినా డిజిటల్ ఆడియన్స్ కి అయినా ఏమైనా ఎక్కుతుందో అనుకుంటే ఇక్కడ రెస్పాన్స్ మరింత నిరాశ కలిగించేలానే ఉందని చెప్పాలి ఇప్పుడు.