రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ హిందీలో సంచలనం సృష్టిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) లాంగ్ రన్ లో ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ ఉండగా రెండు వారాలు కూడా గడవక ముందే సినిమా..
అనేక సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తూ ఊచకోత కోస్తుంది..సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో బిగ్గెస్ట్ మూవీస్ లైఫ్ టైం కలెక్షన్స్ ని ఆల్ రెడీ బ్రేక్ చేయగా హిందీ లో డబ్ అయిన మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది…
సినిమా హిందీలో 10వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ ఎపిక్ కలెక్షన్స్ తో 500 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని టచ్ చేసింది. సినిమా బాలీవుడ్ హిస్టరీలో డబ్బింగ్ మూవీస్ లో ఎపిక్ 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న రెండో మూవీ గా నిలిచింది…
కాగా ఇప్పుడు 11వ రోజున సాధించే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అయ్యింది. ఒక్క అడుగు దూరంలో ఈ ఎపిక్ రికార్డ్ ను అందుకోబోతున్న పుష్ప2 నెలకొల్పే కొత్త రికార్డ్ ఫ్యూచర్ లో వచ్చే డబ్బింగ్ మూవీస్ అందుకోవడం బిగ్గెస్ట్ టార్గెట్ అనే చెప్పాలి…
ఈ రోజు పుష్ప2 మూవీ ఏడేళ్ళ క్రితం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులను నమోదు చేసిన ఎపిక్ బాహుబలి2(Baahubali2 Movie) నెలకొల్పిన 511 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ఈ రోజు క్రాస్ చేయబోతూ ఉండగా…ఇక లాంగ్ రన్ లో సినిమా ఇప్పుడు ఏకంగా…
ఎపిక్ బెంచ్ మార్క్ లను సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు….ఇండస్ట్రీ రికార్డులను ఆల్ రెడీ బ్రేక్ చేస్తున్న పుష్ప2 మూవీ లాంగ్ రన్ లో హిందీలో 700 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి సినిమా ఈ మార్క్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.