Home టోటల్ కలెక్షన్స్ 12 ఇయర్స్ ఓల్డ్ మూవీ “మద గజ రాజ” టోటల్ కలెక్షన్స్…అక్కడ రికార్డ్…ఇక్కడ చుక్కలు!!

12 ఇయర్స్ ఓల్డ్ మూవీ “మద గజ రాజ” టోటల్ కలెక్షన్స్…అక్కడ రికార్డ్…ఇక్కడ చుక్కలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కొన్ని అంచనాలను మించి దుమ్ము లేపాయి…కోలివుడ్ లో చూసుకుంటే ఈ సంక్రాంతి సీజన్ లో కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన విశాల్(Vishal) నటించిన ఓల్డ్ మూవీ మద గజ రాజ(Madha Gaja Raja) మూవీ…

సంక్రాంతికి రిలీజ్ అయ్యి తమిళనాడులో ఊహకందని రేంజ్ లో జోరు చూపించి సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….తమిళనాడులో టోటల్ రన్ లో సినిమా ఏకంగా 52.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసిన ఈ సినిమా….

కర్ణాటకలో 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2.2 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో ఇక్కడ 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ పరంగా సినిమా…

80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని ఇక్కడ మాత్రం తమిళ్ లో మాదిరి ఇంపాక్ట్ ను చూపించలేక డిసాస్టర్ గా నిలిచింది. ఇక టోటల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో లిమిటెడ్ రిలీజ్ లో 30 లక్షల రేంజ్ లో….

గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా రీ రిలీజ్ లో పరుగు పూర్తి అయ్యే టైంకి సినిమా 56.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా…ఓవరాల్ గా 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఏకంగా విశాల్ కెరీర్ లోనే ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here