Home న్యూస్ మగధీర-సరైనోడు ఔట్…F2 దెబ్బ అదుర్స్!

మగధీర-సరైనోడు ఔట్…F2 దెబ్బ అదుర్స్!

0

    సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ కథానాయకుడు మరియు వినయ విధేయ రామ లాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాల కి పోటిగా అంచనాలు ఉన్నా క్రేజ్ తక్కువగా ఉన్న F2 రేసులో స్లో గా ఎంటర్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దిమ్మతిరిగే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచాక కూడా స్లో డౌన్ అవ్వకుండా అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ అయ్యే సమయానికి హిస్టారికల్ 70 కోట్ల క్లబ్ లో చేరి ఇది వరకు ఆ మార్క్ ని అందుకున్న గీత గోవిందం మరియు దువ్వాడ జగన్నాథం సినిమాలను క్రాస్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా…

సినిమా ఇప్పుడు 19 రోజులు ముగిసే సరికి రెండు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ ని క్రాస్ చేయగా కర్ణాటకలో లో 4.1 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 82 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 9.05 కోట్ల షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 19 రోజుల…

టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు ఏకంగా 74 కోట్ల మార్క్ ని అధిగమించాయి. టోటల్ గా 74.15 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సమయం లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన మగధీర తెలుగు వర్షన్ 73.6 కోట్ల రికార్డ్ ను… సరైనోడు తెలుగు వర్షన్

73 కోట్ల రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు మరింత ముందుకు దూసుకు పోతుంది, త్వరలోనే సినిమా మరి కొన్ని పెద్ద సినిమాల ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 4 వ వారం లో కూడా కొత్త సినిమాలు లేకపోవడం తో సినిమా మరింతగా కొనసాగే అవకాశం ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here