బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ బ్యాటింగ్ కొనసాగుతుంది, మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 18 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని బిజినెస్ ని క్రాస్ చేసి మైనర్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 4 వ రోజు లో ఎంటర్ అయ్యింది, తొలి రెండు షోలకి అన్ని సెంటర్స్ లో మూడో రోజు లెవల్ లో కొన్ని సెంటర్స్ లో మూడో రోజు కి మించి కొన్ని సెంటర్స్ లో సినిమా జోరు చూపుతుంది.
ఓవరాల్ గా తొలి 2 షోలకు ఆక్యుపెన్సీ 50% వరకు ఉండగా ఈవినింగ్ అండ్ షోల గ్రోత్ కూడా సాలిడ్ గా ఉండేలా కనిపిస్తుంది, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకోగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే మరోసారి అవలీలగా ఇస్మార్ట్ శంకర్ సినిమా 4 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు.
ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. సమ్మర్ లా సీజన్ కాకున్నా సాలిడ్ వీకెండ్ తో దుమ్ము లేపుతున్న ఇస్మార్ట్ శంకర్ 4 వ రోజు ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ జాబితాలో నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.