Home న్యూస్ 50 కోట్లు ఔట్…భీభత్సానికి పరాకాష్ట!

50 కోట్లు ఔట్…భీభత్సానికి పరాకాష్ట!

0

  కెరీర్ మొదలు పెట్టి 13 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ నికార్సయిన మాస్ హిట్ కొట్టలేక పోయానే అన్న కసి మొత్తం ఒక్క సినిమా తోనే చూపెట్టేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది. ఈ క్రమం లో రామ్ కెరీర్ లో హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్ వసూల్ చేసిన సినిమా గా నిలిచింది ఈ సినిమా.

కాగా రీసెంట్ గా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నిర్మాతల లెక్కల ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు ముగిసే సరికే 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది, 4 రోజుల లోనే 48 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని అనౌన్స్ చేయగా 5 వ రోజు వసూళ్ళ తో సినిమా…

53 కోట్ల మార్క్ ని అందుకుంది, ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం 5 రోజుల్లో 48 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిన సినిమా 6 వ రోజు వసూళ్ళ తో 50 కోట్ల మార్క్ ని కంప్లీట్ చేసుకుంది. ఏది ఏమైనా రామ్ కెరీర్ లో మొట్ట మొదటి 50 కోట్ల గ్రాస్ మూవీ గా ఇస్మార్ట్ శంకర్ దుమ్ము లేపింది అని చెప్పాలి. అది కూడా యావరేజ్ రివ్యూ లతో కుమ్మడమ్ అనేది భీభత్సం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here