బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వర్కింగ్ డే టెస్ట్ ని ఎదురుకున్న ఇస్మార్ట్ శంకర్ రోజు ని సాలిడ్ గా ముగించింది, తొలి రెండు షోలకు 25% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అయిన సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి 33% వరకు ఆక్యుపెన్సీ తో జోరు చూపింది. దాంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా 5 వ రోజు ని ఘనంగా ముగించి వర్కింగ్ డే టెస్ట్ లో పాస్ అయ్యింది అని చెప్పోచ్చు.
సినిమా మినిమం లో మినిమం 2 కోట్ల రేంజ్ లో షేర్ ని 5 వ రోజు సాధించే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని ఏరియాల్లో క్లియర్ గా తెలియరాలేదు కాబట్టి అవి బాగుంటే ఈ లెక్క 2.2 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం అలాగే ఆ మార్క్ ని కూడా మించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక సినిమా 5 వ రోజున కలెక్షన్స్ తో 25 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి రామ్ కెరీర్ లో మొదటి 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో సినిమా 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.