ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న డియర్ కామ్రేడ్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుమారు 1500 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో లను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి తొలి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. మరి ఆ టాక్ ఎలా ఉందో తెలుసు కుందాం పదండి…
స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా స్టూడెంట్ లీడర్ అయిన హీరో ప్రతీ విషయంలో అనవసరంగా గొడవల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. తన ఎదురింట్లో వాళ్ళ పెళ్ళికి వచ్చిన హీరోయిన్ తో ప్రేమ లో పడటం తర్వాత తన కెరీర్ కి అండగా నిలుస్తాడు. కానీ మధ్యలో అనేక సమస్యలు వస్తాయి, అవి ఏంటి అనేది మాత్రం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు.
ఓవరాల్ గా స్టొరీ పాయింట్ సింపుల్ గా అనిపించినా డెప్త్ ఉన్న కథ అని అంటున్నారు. ఆ కథ ని రియలిస్టిక్ గా చెప్పడానికి దర్శకుడు లీడ్ పెయిర్ పాత్రలను నాచురల్ గా చూపెట్టినా అది ఒక దశ దాటిన తర్వాత బోర్ ఫీల్ అయ్యేలా స్క్రీన్ ప్లే తో కూడుకుని ఉండి పూర్తిగా ఆకట్టుకోలేదని మరీ ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ చాలా స్లో గా ఉందని అంటున్నారు.
ఓవరాల్ గా విజయ్, రష్మిక ల పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని, తర్వాత సంగీతం వినడం కన్నా చూడటానికి బాగుందని, డైరెక్షన్ పరంగా భరత్ కమ్మా మంచి పాయింట్ ని చెప్పడానికి ఎంచుకున్నా స్లో నరేషన్ అలాగే మరీ ఎమోషనల్ సీన్స్ తో పూర్తిగా ఆకట్టుకోలేదని అంటున్నారు.
ఫైనల్ గా సినిమా కి ఓవర్సీస్ నుండి ఎబో యావరేజ్ టాక్ లభించింది అని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారగా ఇదే రేంజ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.