కెరీర్ మొదలు పెట్టి 5 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని సొంతం చేసుకోలేని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కుమ్మేసినా రెండో వారం స్లో డౌన్ అయింది కానీ తిరిగి మూడో వారం నుండి మరింత జోరు చూపుతూ దూసుకు పోయింది.
మొత్తం మీద రీసెంట్ గా 25 రోజులను పూర్తి చేసుకున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొదటి క్లీన్ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులు పూర్తి అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో 13.61 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక వరల్డ్ వైడ్ గా 14.68 కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా, 25 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ సినిమా 12 లక్షల షేర్ ని అందుకుని ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి. సినిమా బిజినెస్ ఇదివరకు 16.2 కోట్లు అయినా…అందులో…
2 కోట్ల ఓన్ రిలీజ్ ఉందని నిర్మాతలు చెప్పడం తో ఫైనల్ బిజినెస్ 14.2 కోట్లు అయింది. సినిమా 15 కోట్లకు పైగా టార్గెట్ ని అందు కుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇప్పటికే 14.68 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా సాహో రిలీజ్ సమయానికి 15 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు.
దాంతో సినిమా ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది, 5 ఏళ్ల కి కెరీర్ లో తొలి బ్రేక్ ఈవెన్ మూవీ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు బెల్లంకొండ, ఇక లాంగ్ రన్ లో మరెంత దూరం వెళుతుంది అన్నది సాహో ని తట్టుకుని ఈ సినిమా ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేస్తుంది అన్నదాని పై ఆధారపడి ఉంటుంది.