మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ వాల్మీకి ప్రేక్షకుల ముందుకు మరి కొన్ని గంటలలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నా సినిమా బిజినెస్ మొత్తం వరుణ్ తేజ్ పేరు మీదే జరిగింది, 24.25 కోట్ల బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ 940 మార్క్ అందుకుంది, ఒక సారి ఏరియాల వారిగా సినిమా థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
?Nizam – 220
?Ceeded – 150
?Andhra – 280
?AP-TG – 650
?Ka & ROI – 120
?OS – 170
?Total WW – 940…. ఇదీ మొత్తం మీద వరల్డ్ వైడ్ గా వాల్మీకి సినిమా థియేటర్స్ కౌంట్..
ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 4 రోజుల ముందు నుండే మొదలు అయినా అన్ని సెంటర్స్ లో మాత్రం రిలీజ్ కి ఒక రోజు ముందు వరకు పూర్తిగా ఓపెన్ కాలేదు, కాగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం ఓవరాల్ గా 25% వరకు జరిగినట్లు సమాచారం. అది కొంచం షాక్ ఇచ్చే అంశమే.
కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం బాగున్నాయని రిపోర్ట్స్ అందుతున్నాయి, దాంతో సినిమా మొదటి రోజు మంచి వసూళ్ళనే అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని గమనిస్తే 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి రోజు మొత్తం గ్రోత్ ని కంటిన్యు చేస్తే సినిమా 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, పోటి లో బందోబస్త్ కూడా ఉండటం తో ఏ సినిమా కి బెటర్ టాక్ వచ్చింది అన్న దాని పై కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పాలి.