Home న్యూస్ వార్ తెలుగు రివ్యూ….ఫస్ట్ డే 50 కోట్లు పక్కా!

వార్ తెలుగు రివ్యూ….ఫస్ట్ డే 50 కోట్లు పక్కా!

0

      బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ వార్, హిందీ లో అల్టిమేట్ క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్ లో సైరా కి పోటి గా అన్ని భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే ఒక రాబరీ చుట్టూ కథ ఉంటుంది, ఆ రాబరీ చేసింది హృతిక్ ఎందుకు చేశాడు, దేని కోసం చేశాడు, ఆ రాబరీ ని రికవరీ చేయడానికి వచ్చిన టైగర్ ష్రాఫ్ ఎవరు…ఇలాంటివి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. సినిమా కథ పాయింట్ సింగిల్ లైన్ లో చెప్పేదే…

కానీ తెరకెక్కించిన విధానం టేకింగ్ ఆకట్టుకున్నాయి.. ముందు నుండే ఇది పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని చెప్పారు కాబట్టి అదే బ్రెయిన్ లో పెట్టుకుని చూస్తె సినిమా ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయోచ్చు. హృతిక్ గురించి చెప్పేదేముంది… చాలా ఏళ్ళకి ఫుల్ యాక్షన్ మూవీ చేశాడు…

అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, యాక్షన్ సీన్స్, డాన్స్ అన్నీ అదరగొట్టేశాడు. హృతిక్ కి ఏమాత్రం తీసిపోలేదు టైగర్ ష్రాఫ్, పెర్ఫార్మెన్స్ యావరేజ్ కానీ డాన్స్ అండ్ ఫైట్స్ లో కుమ్మేశాడు. ఇక హీరోయిన్ వాని కపూర్ యావరేజ్ మార్కులే సొంతం చేసుకుంది.

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది, అలాగే కథ ని సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక డైరెక్షన్ పరంగా సిద్దార్థ్ ఆనంద్ మంచి యాక్షన్ మూవీ ని తీశాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టి లో పెట్టుకుని వాళ్లకి ఏం కావాలో అవన్నీ…

సినిమా లో ఉండేలా చూసుకున్నాడు. కానీ కథ మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటె ఇండియన్ సినిమా హిస్టరీ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీస్ లో వార్ సినిమా ఒకటిగా నిలిచేది. అయినా కానీ ఉన్నంతలో సినిమా మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకునే సినిమా..

సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్… ముందే చెప్పినట్లు మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది, కొత్త కథలు కావాలి, హెవీ యాక్షన్ సీన్స్ వద్దు అనుకునే వారికి సినిమా యావరేజ్ లా అనిపిస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ టికెట్ సేల్స్ ని అందుకున్న సినిమా గా నిలిచింది.

తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అవలీలగా 50 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకునే అవకాశం ఉందని సమాచారం. మరి రోజు ముగిసే సరికి సినిమా అనుకున్న అంచనాలను కూడా మించుతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here