Home న్యూస్ ఇదే ఫైనల్….సైరా నరసింహా రెడ్డి ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….సైరా నరసింహా రెడ్డి ఫైనల్ టాక్ ఇదే!!

2244
0

     మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోలకు ఇటు రెగ్యులర్ మార్నింగ్ షోలకు సినిమా కి మంచి రివ్యూ లు దక్కాయి. ఇక ఆడియన్స్ రెస్పాన్స్ కూడా సాలిడ్ గా ఉంది, ఇక ఈవినింగ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి సినిమా కి ఫైనల్ గా ఎలాంటి టాక్ లభించింది అన్నది ఆసక్తిగా మారింది.

ఈవినింగ్ షోలు పూర్తీ అయ్యాక చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న మాట “మెగాస్టార్ నట విశ్వరూపం” లవ్ ట్రాక్ అంత పెర్ఫెక్ట్ గా లేక పోయినా బ్రిటిష్ వారి పై పోరాడే నరసింహా రెడ్డి గా మెగాస్టార్ అద్బుతంగా నటించాడని అంటున్నారు.

యాక్షన్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో అదరగొట్టాడని, ఇక క్లైమాక్స్ లో అయితే ఏడిపించే నటనతో తానెందుకు మెగాస్టార్ అయ్యాడో మరోసారి రుజువు చేసే నటనతో దుమ్ము లేపాడని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కొంచం స్లో గా అనిపించినా ఆద్యంతం ఆకట్టుకుందని.. సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇక రెగ్యులర్ కామన్ ఆడియన్స్ చాలా మంది సినిమా స్లో నరేషన్ అండ్ లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ చిరు కి ఫస్ట్ లో లవ్ స్టొరీ సెట్ కాలేదని కానీ అవి పక్కకు పెడితే మిగిలిన మొత్తం అంచనాలను మించే విధంగా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్, యాక్షన్ సీన్స్, గ్రాండియర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి అంటున్నారు.

మొత్తం మీద సినిమా సూపర్ హిట్ అని, రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అంటున్నారు. ఫైనల్ గా సినిమా రోజు ను సూపర్ హిట్ టాక్ తో మొదలు పెట్టి రోజు మొత్తం అదే టాక్ ని కంటిన్యు చేసింది అని చెప్పాలి. ఇక దసరా సెలవులు పూర్తీ అయ్యే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here