టాలీవుడ్ హీరోలు ఇది వరకు రెమ్యునరేషన్ మాత్రమె తీసుకునే వారు, కానీ రీసెంట్ టైం లో రెమ్యునరేషన్ కి తోడుగా సినిమా ల ఏరియాల రైట్స్, లేదా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, లేదా లాభాల్లో వాటాలు లాంటివి కూడా రెమ్యునరేషన్ లేదా రెమ్యునరేషన్ తో పాటు ఎక్స్ ట్రా గా తీసుకుంటున్నారు. దాంతో హీరోల రెమ్యునరేషన్ ఇంత అని ఇప్పుడు ఎవరూ క్లియర్ గా చెప్పలేక పోతున్నారు. ఇక రీసెంట్ గా సంక్రాంతి రేసులో…
భారీ పోటి నడుమ కూడా అల్టిమేట్ విజయాన్ని అల వైకుంఠ పురం లో సినిమా తో సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో సినిమా కి యావరేజ్ గా రెమ్యునరేషన్ పరంగా 20 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని….
దానితో పాటు సినిమా ఓవరాల్ గా నిర్మాతకి వచ్చిన ప్రాఫిట్ లో 10% రెమ్యునరేషన్ గా తీసుకునేవారని సమాచారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్యా హీరోలు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలి అని ఇండస్ట్రీ పెద్దలు చెప్పగా… ఒక్కోక్కరిగా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకున్న వార్తలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్…
తను తీసుకునే రెమ్యునరేషన్ లో 5 కోట్ల మేర తగ్గించుకోబోతున్నారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ అండ్ 10% ప్రాఫిట్ కలిపి ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జున్… 5 కోట్ల మేర రెమ్యునరేషన్ ని తగ్గించుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కో సినిమా కి కొంత కాలం పాటు…
25 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇక ఇది ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమా నుండే జరుగుతుందని సమాచారం. ఇక మిగిలిన హీరోలు కూడా ఇలాగే తగ్గించుకుంటే సినిమాల బడ్జెట్ కూడా తగ్గి పరిస్థితులకు తగ్గట్లు కొంతకాలం నిర్మాతలను ఆదుకున్న వాల్లు అవుతారు అని చెప్పొచ్చు.