రష్మిక మందన టాలీవుడ్ లో ఛలో సినిమాతో అడుగు పెట్టి మంచి స్టార్ట్ ని సొంతం చేసుకోగా కెరీర్ బెస్ట్ హిట్ ని ముందు గీత గోవిందం తో సాధించి వరుస ఆఫర్లను టాలీవుడ్ లో సొంతం చేసుకుంది, ఈ టైం లో తను కన్నడ లో నటించిన 2017 మూవీ చమక్ ని ఇక్కడ గీత గోవిందం మరియు ఛలో పేర్లు కలిపి గీతా ఛలో పేరుతో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో డబ్ చేశారు.
సమ్మర్ లో ఇక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా ను ఎవ్వరూ పెద్దగా పట్టించు కోలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చిల్లర కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో శాటిలైట్ రైట్స్ కూడా ఏడాది కి పైగా ఎవ్వరూ పట్టించు కోలేదు, ఇలాంటి టైం లో…
ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు కేవలం 20 లక్షల రేంజ్ రేటు మాత్రమే చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేశారు, అది కూడా రాంగ్ టైం లో సినిమా ను టెలికాస్ట్ చేయడం తో….
TRP రేటింగ్ పరంగా దెబ్బ గట్టిగానే పడింది అని చెప్పాలి… సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు లోవేస్ట్ TRP రేటింగ్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచి 2.16 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది, ఉదయం 9 గంటల టైం లో ఈ సినిమా ప్రీమియర్ ని వేశారు జీ తెలుగు లో…. అలా కాకుండా…
మధ్యాహ్నం లేదా ఈవినింగ్ టైం లో వేసి ఉంటె సినిమాకి మంచి రేటింగ్ దక్కి ఉండేది, పెట్టిన రేటు కి మంచి ప్రాఫిట్ కూడా సినిమా సొంతం చేసుకుని ఉండేది కావచ్చు. కానీ ఇప్పటికీ కూడా సినిమా ను కొన్న రేటు కి ఇది డీసెంట్ TRP రేటింగ్ అనే చెప్పాలి… తర్వాత టెలికాస్ట్ నుండి సినిమా ద్వారా ఛానెల్ కి ప్రాఫిట్ పక్కాగా వస్తుంది అని చెప్పొచ్చు.