2020 ఇయర్ లో బాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ హిట్ కొట్టిన హీరో అజయ్ దేవగన్… కెరీర్ లో 100 వ సినిమా గా తెరకెక్కిన తానాజీ ది అన్ సంగ్ వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఆల్ మోస్ట్ 280 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా అజయ్ దేవగన్ నటిస్తున్న కొత్త సినిమా భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా…
ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఫస్ట్ వేవ్ వలన రిలీజ్ ఆగిపోగా సినిమా ను తర్వాత మంచి డీల్ రావడం తో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా కి ఏకంగా…
110 కోట్ల రేంజ్ రేటు ఇచ్చి హక్కులను సొంతం చేసుకోగా సినిమా ఇతర టోటల్ బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. సినిమా కి ఓవరాల్ బడ్జెట్ 80 కోట్ల రేంజ్ లో అయిందని సమాచారం. భారీ గ్రాండియర్ గా సినిమా ను రూపొందించడంతో ఈ రేంజ్ బడ్జెట్ అయిందట.
ఇక సినిమా 110 కోట్ల స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్స్ కింద 50 కోట్ల రేటు ని దక్కించుకుందట… ఇక మ్యూజిక్ రైట్స్ కింద 15 కోట్లు దక్కాయట ఈ సినిమాకి. దాంతో టోటల్ బిజినెస్ లెక్క 175 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా అవ్వగా సినిమా కి పెట్టిన 80 కోట్ల బడ్జెట్ కి గాను ఓవరాల్ గా సినిమా సాధించిన…
బిజినెస్ 175 కోట్లు కాగా పెట్టిన బడ్జెట్ మీద మొత్తం మీద 95 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ లోనే డిజిటల్ రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎందుకో వరుసగా డిలే చేస్తూ వస్తున్న ఈ సినిమా ను ఎప్పుడు రిలీజ్ చేస్తారూ అన్నది క్లారిటీ లేకుండా పోయింది. అంత రేటు పెట్టి కొని ఇలా డిలే చేయడం ఏంటో వీళ్ళకే తెలియాలి..