ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన సినిమాల్లో అన్ని సినిమాల లోకి ముందు నిలిచే సినిమా కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ మూవీ. సంక్రాంతి రేసు లో 50% ఆక్యుపెన్సీ తోనే బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊరమాస్ అనిపించే రికార్డులను నమోదు చేసింది. తెలుగు లో కూడా ఈ సినిమా…
అద్బుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా టాక్ కొంచం వీక్ గా ఉండటం తో లాంగ్ రన్ లో మిగిలిన సినిమాల మాదిరి జోరు చూపకున్నా కానీ విజయ్ కి తెలుగు లో ఆల్ టైం బిగ్గెస్ట్ షేర్ ని తెలుగు లో సొంతం అయ్యేలా చేసింది. అలాంటి ఈ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా అద్బుతమైన వ్యూస్ ని సొంతం చేసుకుంది. కానీ తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం ఆశించిన మేర TRP రేటింగ్ లను ఈ సినిమా సొంతం చేసుకోలేదు.
తమిళ్ లో రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకుంటే తక్కువ రేటింగ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో విజయ్ నటించిన ఇతర సినిమాలతో పోల్చితే వీక్ రేటింగ్ లను సొంతం చేసుకుంది. సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 4.81 TRP రేటింగ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా సెకెండ్ టైం టెలికాస్ట్ అవ్వగా…
రెండో సారి TRP కేవలం 3.8 మాత్రమే సొంతం చేసుకుంది. ఇదే టైం లో విజయ్ విజిల్ సినిమా వేసిన ప్రతీసారి సెన్సేషనల్ రేటింగ్ లను సాధించింది, అలాగే విజయ్ ఓల్డ్ మూవీస్ కూడా సాలిడ్ రేటింగ్ లను సాధించిగా మాస్టర్ ఒక్కటే తెలుగు లో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయినా టెలివిజన్ లో బిలో పార్ రేటింగ్ లతోనే సరిపెట్టుకుంటుంది.