రీసెంట్ టైం లో చిన్న సినిమాలకు సాంగ్స్ సూపర్ హిట్ అయితే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో నిరూపించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాతిరత్నాలు లాంటి సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేయడం లో సాంగ్స్ కీలక పాత్ర పోషించగా ఉప్పెన సినిమా పై అల్టిమేట్ క్రేజ్ రావడానికి కూడా సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. వాటి కోవలోనే చిన్న సినిమా అయిన…
SR కళ్యాణ మండపం కూడా సాంగ్స్ సూపర్ హిట్ వలన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు రిలీజ్ అయినా ఆడియన్స్ థియేటర్స్ కి తరలి వస్తారు అన్న నమ్మకం వలన డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి…
ఆడియన్స్ ముందుకు ఆగస్టు లో రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ బడ్జెట్ కి డబుల్ రేంజ్ లో జరుగుతూ వస్తుంది. రీసెంట్ గా సినిమా నైజాం ఏరియా బిజినెస్ కూడా కన్ఫాం అయిందని సమాచారం. చిన్న సినిమా అయినా కానీ 1.9 కోట్ల లోపు బడ్జెట్ లోనే…
తెరకెక్కిన ఈ సినిమా నైజాం ఏరియా లోనే 1.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అంటే సినిమా ఆల్ మోస్ట్ బడ్జెట్ ఇక్కడ నుండే రికవరీ అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 5 కోట్లకు పైగా జరిగిందని సమాచారం. త్వరలోనే ఏరియాల వారి బిజినెస్ లెక్కలు రిలీజ్ కానున్నాయి. ఇక సినిమా కూడా ఆడియన్స్ ముందుకు…
ఆగస్టు టైం లో రావడానికి సిద్ధం కానుండగా థియేటర్స్ కి జనాలను తిరిగి రప్పించే సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని అంతా ఆశిస్తున్నారు. సినిమా ఓవరాల్ బడ్జెట్ కి అద్బుతమైన ప్రాఫిట్ ను నిర్మాతలకు దక్కించి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే అన్ని లెక్కలు అఫీషియల్ గా రిలీజ్ కాబోతున్నాయి.