బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం కొత్త సినిమాలు బాగానే రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా అందులో రొమాంటిక్ మరియు వరుడు కావలెను సినిమాలు కొంచం నోటబుల్ మూవీస్ కాగా మిగిలిన అన్ని సినిమాలలో డబ్బింగ్ మూవీ జై భజరంగి కొంచం నోటబుల్ రిలీజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోబోతుంది… ఈ మూడు సినిమాలు కలిపి తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 1100 కి పైగా థియేటర్స్ లో…
రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అన్ని సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మూడు రోజుల ముందే ఓపెన్ చేయగా అన్ని సినిమాలలోకి ఉన్నంతలో రొమాంటిక్ సినిమా మాస్ ఏరియాలలో అలాగే యూత్ ఎక్కువగా చూసే కొన్ని సెంటర్స్ లో బుకింగ్స్ కొంచం బెటర్ గా ఉన్నాయి.
వరుడు కావలెను కంప్లీట్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా కాగా జై భజరంగి పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఉన్నంతలో ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
తొలిరోజు మాస్ సెంటర్స్ లో డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, ఉన్నంతలో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 70-90 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఇక వరుడు కావలెను సినిమా బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నా డీసెంట్ టాక్ వచ్చినా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ఛాన్స్ ఎంతైనా ఉండటంతో…
సినిమా కూడా 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం… ఇక డబ్బింగ్ మూవీ జై భజరంగి కంప్లీట్ గా టాక్ బాగుంటేనే జనాలను థియేటర్స్ కి రప్పించవచ్చు. టాక్ బాగుంటే సినిమా 10-12 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.