విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం 2 బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ ఇప్పుడు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25 న సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా…
సడెన్ గా రిలీజ్ చేయడంతో ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించింది, ఫస్ట్ డే టోటల్ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 4.25 మిలియన్ వ్యూస్ ని 54 వేల లైక్స్ ని సొంతం చేసుకుని ఒకింత నిరాశ పరిచే వ్యూస్ అండ్ లైక్స్ నే సొంతం చేసుకోగా రెండో రోజు మట్టుకు యూట్యూబ్ లో…
సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ రెండో రోజు ఏకంగా 3.67 మిలియన్ వ్యూస్ ని 9 వేల లైక్స్ ని అందుకుంది, ఫస్ట్ డే మిస్ అయినా రెండో రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ని తెచ్చుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక సినిమా ఈ నెల 25న ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.