ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని ఇప్పటికీ సాలిడ్ గా కొనసాగిస్తూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం స్లో అయినా కానీ హిందీ బెల్ట్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని ఇప్పటికీ సొంతం చేసుకుంటూ ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందు….
డిజిటల్ రిలీజ్ పై లెక్కలన్నీ చూసుకుని ఆర్ ఆర్ ఆర్ 7న వస్తుంది కాబట్టి అప్పటికి థియేటర్స్ అన్నింటిలో ఆ సినిమానే ఉంటుంది అని ముందే తెలియడంతో 3 వీక్స్ గ్యాప్ తో డిజిటల్ డీల్ చేసుకున్నారు మేకర్స్… కానీ సినిమాకి ఆర్ ఆర్ ఆర్ తో పాటు…
రాధే శ్యామ్ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో లాంగ్ రన్ ఇంకా దక్కే అవకాశం సొంతం అవ్వగా హిందీలో సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేయడంతో అక్కడ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇలాంటి టైం లో ముందే 3 వీక్స్ గ్యాప్ తో డీల్ చేసుకోవడంతో పుష్ప సినిమాను ఇప్పుడు…
ఈ నెల 7న అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ సౌత్ భాషలు అన్నింటిలో రిలీజ్ చేయబోతుండగా సినిమా హిందీ వర్షన్ ను మరో వారం గ్యాప్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. కాగా సినిమా ఓవరాల్ గా అమెజాన్ ప్రైమ్ కొన్న రేటు ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది, ఆ రేటు ప్రకారం 22 కోట్ల రేటుకి సినిమా డిజిటల్ రైట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయని సమాచారం…
కానీ ఇందులో హిందీ వర్షన్ ని ఇంక్లూడ్ చేయలేదు అని అంటున్నారు కానీ దానిపై ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఓవరాల్ గా ఇది సెన్సేషనల్ రేటు అనే చెప్పాలి. సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వడం వలన బాక్స్ ఆఫీస్ రన్ ఎఫెక్ట్ అవ్వడం ఖాయం కానీ సంక్రాంతి రేసులో పుష్ప కి మంచి థియేటర్స్ కౌంట్ ఉండేలా ఉండటంతో లాంగ్ రన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.