Home టోటల్ కలెక్షన్స్ ది గోట్ లైఫ్ టోటల్ కలెక్షన్స్….కమర్షియల్ మూవీ కాదు…అయినా కూడా భీభత్సం!!

ది గోట్ లైఫ్ టోటల్ కలెక్షన్స్….కమర్షియల్ మూవీ కాదు…అయినా కూడా భీభత్సం!!

0

పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) చాలా డిలే తర్వాత ఆడియన్స్ ముందుకు సమ్మర్ లో రిలీజ్ అవ్వగా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది…

సినిమా నార్మల్ కమర్షియల్ మూవీ అయితే కాదు…ఎక్స్ పెరిమెంటల్ మూవీ…అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది. తెలుగు లో మాత్రం మంచి రివ్యూలు వచ్చినా కూడా పెద్దగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా…

టోటల్ రన్ లో 2.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు వాల్యూ టార్గెట్ రేంజ్ 1.8 కోట్ల దాకా ఉండగా టార్గెట్ కి 55 లక్షల దూరంలో ఆగిపోయి ఇక్కడ టిల్లు స్క్వేర్(Tillu Square) హవా వలన అంచనాలను అనుకున్న రేంజ్ లో అందుకోలేక పోయింది….

ఇక టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Aadujeevitham – The Goat Life Movie Total WW Collections Report
👉Kerala – 78.90CR
👉Telugu States- 2.70Cr~
👉Tamilnadu – 8.20Cr~
👉KA+ROI – 9.35Cr
👉Overseas – 59.65CR
Total WW Collections – 158.80CR(71.35CR~ Share)

సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ లెక్కలు క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచన…ఆ టార్గెట్ మీద సినిమా టోటల్ రన్ లో 30 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి…

Aadujeevitham - The Goat Life 4 Days Total WW Collections....Fastest 65CR Grosser in Mollywood!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here