బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి నేడు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కొంచం ఆలస్యంగా ఓపెన్ అవ్వగా రవితేజ మూవీస్ ఎక్కువ శాతం ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర ఎక్కువ టికెట్ సేల్స్ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు ఖిలాడి విషయంలో కూడా ఇదే జరగగా…
ఆంధ్రలో సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయింది, కానీ అక్కడ టికెట్ రేట్స్ తక్కువగా ఉండటం అలాగే 50% ఆక్యుపెన్సీనే ఉండటంతో హౌస్ ఫుల్ బోర్డులు పడటం సహజం అనే చెప్పాలి. ఇక నైజాం ఏరియా విషయానికి వస్తే రీసెంట్ మూవీస్ కి ఉన్న ఇంపాక్ట్….
ఇప్పుడు ఖిలాడికి కూడా ఎఫెక్ట్ చూపుతూ ఆక్యుపెన్సీ ఇక్కడ ఓవరాల్ గా 15-20% రేంజ్ లో ఉందని చెప్పాలి. కానీ ఈవినింగ్ షోలకు బుకింగ్స్ బాగున్నాయి అని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు జరుతున్న బుకింగ్స్ ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని…
సొంతం చేసుకోవడానికి అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి నైజాంలో గ్రోత్ చూపించి షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే ఓవరాల్ గా లెక్క 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక హిందీ లో లిమిటెడ్ రిలీజ్ అయినా కానీ ముంబై, డిల్లీ లాంటి ఏరియాల్లో షోస్ ఫుల్ అవ్వడం విశేషం, అక్కడ కంప్లీట్ రిపోర్ట్….
ఈవినింగ్ షోల టైం కి అందుతుంది కాబట్టి అప్పుడు క్లియర్ గా వాటిని అప్ డేట్ చేస్తాం. మొత్తం మీద పరిస్థితులు మరీ అనుకూలంగా లేకున్నా కానీ మాస్ మహారాజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్ముతున్నాడు అని చెప్పాలి. మరి డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక.. డే ఎండ్ అయ్యే టైం కి మరో రిపోర్ట్ తో ఆర్టికల్ ని పబ్లిష్ చేస్తాం..