బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మొత్తం మీద 4 సినిమాలు రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ అట్రాక్షన్ ని ఎక్కువగా సొంతం చేసుకున్న సినిమాలుగా ఖిలాడి మరియు డిజే టిల్లు సినిమాలు నిలుస్తాయి అని చెప్పాలి. వీటిలో రవితేజ ఖిలాడి పెద్ద సినిమా అయినా కానీ ప్రమోషన్స్ పరంగా చిన్న సినిమా రేంజ్ ప్రమోషన్స్ కూడా జరగలేదు, అదే టైం లో డిజే టిల్లు సినిమాకి పెద్ద సినిమాల రేంజ్ ప్రమోషన్స్ జరిగాయి.
దాంతో ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్పష్టంగా కనిపించి డిజే టిల్లు సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఖిలాడి మిక్సుడ్ రెస్పాన్స్ ఎఫెక్ట్ వలన కొంచం ఇబ్బంది పడింది. అయినా కానీ ఉన్నంతలో పోటిని తట్టుకుని….
రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఖిలాడి సినిమా ఇప్పుడు మూడో రోజు మాత్రం కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయింది. ఆంధ్రలో బాగానే ఉన్నప్పటికీ కూడా నైజాంలో మాత్రం డ్రాప్స్ హెవీగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక డిజే టిల్లు సినిమా రెండో రోజు మరోసారి….
ఊరమాస్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతుంది. మొత్తం మీద ఖిలాడి సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు మరోసారి 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా డిజే టిల్లు సినిమా 20% లోపు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ డిజే టిల్లుకి ఎక్స్ లెంట్ గా సాగుతూ ఉండగా ఖిలాడి కి మాత్రం అనుకున్న రేంజ్ లో లేవు…
ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ బాగుంటే ఖిలాడి ఈ రోజు 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక డిజే టిల్లు సినిమా 2 కోట్ల రేంజ్ లో ఈ రోజు వసూళ్లు సొంతం చేసుకోవచ్చు. ఖిలాడి మైండ్ బ్లాంక్ చేసినా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే గ్రోత్ చూపించొచ్చు. మరి రోజు ముగిసే సరికి రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక…