గీత గోవిందం లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమా వచ్చేశాడు. ఎప్పుడో సమ్మర్ లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమా అనేక కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి తర్వాత లీక్ అయ్యి అనేక సమస్యలను ఎదురుకుని నేడు భారీ ప్రీమియర్ షోలతో రిలీజ్ అయింది.
ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుండి సినిమా కి వస్తున్న టాక్ ని గమనిస్తే… కథ గురించి పూర్తిగా చెప్పకున్నా స్టడీ కంప్లీట్ అయ్యాక ఏం ఉద్యోగం లేకుండా కాలీగా ఉండే హీరో అనుకోకుండా ఒక టాక్సీ కొని టాక్సీ డ్రైవర్ అయిపోతాడట.
తర్వాత తన జీవితం లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది అసలు స్టోరీ లైన్ అని అంటున్నారు. మొత్తం మీద సినిమా మొదటి అర్ధభాగం అంచనాలకు తగ్గట్లే సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ లైట్ కామెడీ సీన్స్ తో సరదాగా సాగిందని.
మంచి పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా సెకెండ్ ఆఫ్ కూడా 35 నిమిషాల పాటు అదే ఫ్లో లో మెయిన్ టైన్ అయి సినిమా మెప్పిస్తుందని, కానీ తర్వాత 30 నిమిషాలు మాత్రం కొంత సాగదీసినట్లు అనిపిస్తుందని చూసిన వాళ్ళు చెబుతుండటం విశేషం.
క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఎంతమంది కనెక్ట్ అవుతారు అన్నదాని పై సినిమా ఎంతదూరం వెళుతుందో చెప్పవచ్చని అంటున్నారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ తన పెర్ఫార్మెంస్ తో లైట్ కామెడీ సింగిల్ లైన్ డైలాగ్స్ తో చాలా వరకు ఆకట్టుకున్నాడని అంటున్నారు.
హీరోయిన్ ప్రియాంకా కూడా ఆకట్టుకోగా సంగీతం పరంగా మాటే వినధుగ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద సినిమాలో చాలా ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. టోటల్ గా సినిమాకి ఓవర్సీస్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ టాక్ లభించింది అని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.